ఆమె బాయ్ఫ్రెండ్ చాలా కూల్!

- Advertisement -


శోభిత ధూళిపాల గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో ‘గూఢచారి’ వంటి సినిమాల్లో నటించింది. హిందీలో ఇంకా ఎక్కువ పాపులర్ ఈ భామ. ఇటీవలే ‘నైట్ మేనేజర్’ అనే వెబ్ సిరీస్ లో బికినీ సోయగాలు పర్చింది. ముద్దు సీన్లతో హీటెక్కించింది. అలా మీడియాలో, సోషల్ మీడియాలో ఈ భామ ట్రెండ్ అవుతోంది.

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన బాయ్ ఫ్రెండ్ గురించి ఈ భామ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఆమె బాయ్ఫ్రెండ్ ఎవరో కాదు మన తెలుగు హీరో నాగ చైతన్య. వైజాగ్ కి చెందిన తెలుగు అమ్మాయి… శోభిత. ఆమెతో ప్రస్తుతం నాగ చైతన్య డేటింగ్ లో ఉన్నాడు.

వీరిద్దరూ ఆ మధ్య లండన్ లో చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కారు.

“నాగ చైతన్య చాలా కూల్. నింగి కూలినా బెణకడు. ప్రశాంతంగా ఉంటాడు. పెద్దగా మాట్లాడారు. హుందాగా ప్రవర్తిస్తారు,” అని తెలిపింది ఈ భామ.

మరి ఈ భామ నాగ చైతన్యతో నటిస్తుందా అనేది చూడాలి.

 

More

Related Stories