శ్రీజ పేరులో కళ్యాణ్ మాయం!

Sreeja


చిరంజీవి రెండు కూతురు శ్రీజ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. నిన్నమొన్నటి వరకు తన పేరులో కళ్యాణ్ ని ఉంచుకున్న ఆమె ఇప్పుడు పేరుని మార్చేశారు. ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ పేరు మారింది. మొన్నటివరకు ఆమె అకౌంట్ పేరు.. శ్రీజ_కళ్యాణ్ (@sreeja_kalyan). ఇప్పుడు శ్రీజ కొణిదెల (Sreejakonidela).

Advertisement

ఏకంగా హ్యాండిల్ పేరు మార్చెయ్యడం అంటే తేడానే అని చెప్పాలి. సాధారణంగా ప్రొఫైల్ లో మాత్రం పేరు మార్చుకుంటారు ఎవరైనా, డీపీ మార్చినట్లుగా. ఏకంగా అకౌంట్ హ్యాండిల్ నేమ్ మార్చెయ్యడం అంటే ఇద్దరి మధ్య సంథింగ్ తేడా కొట్టినట్లే.

నిజానికి శ్రీజ, కళ్యాణ్ దేవ్ కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆమె అకౌంట్ మార్చడంతో ఆ పుకార్లు నిజామేనా అని సందేహం వస్తుంది.

శ్రీజ మొదట శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. అతనితో విడిపోయిన తర్వాత కళ్యాణ్ దేవ్ తో వివాహం జరిగింది. కళ్యాణ్ దేవ్ తో ఆమెకి నావిష్క పుట్టింది. మరి ఇప్పుడు వీరి మధ్య ఏమైందో తెలియదు. కానీ ఆమె పేరు, హ్యాండిల్ మార్చుకోవడం మాత్రం అనేక ఊహాగానాలకు తావు ఇస్తోంది.

Advertisement
 

More

Related Stories