తన క్రేజెంటో చూపించిన శ్రీలీల

TeluguCinema 14 Jun 2023
Sreeleela in Ustaad Bhagat Singh

శ్రీలీల … శ్రీలీల… శ్రీలీల…

తెలుగు సినిమా జపం చేస్తోన్న పేరు అది. యువ హీరో అయినా పెద్ద హీరో అయినా ఈ భామతోనే జతకడుతున్నారు. ఒకప్పుడు పూజ హెగ్డేకి ఉండేది అలాంటి క్రేజ్. ఇప్పుడు శ్రీలీలకి దక్కింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నితిన్, రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్… ఇలా ఆరుగురు హీరోల సరసన నటిస్తోంది. ఇక బాలయ్యకి కూతురు వరసయ్యే పాత్ర పోషిస్తోంది. మొత్తంగా ఆరు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఏడోది ఈ వీకెండ్ షూటింగ్ మొదలుపెట్టనున్నది.

ఆమెకున్న క్రేజెంటో ఈ రోజు అందరికీ అర్థమైంది. ఆమె నటిస్తున్న ఆరు సినిమాల నుంచి ఆమె మొదటి లుక్ పోస్టర్లు వచ్చాయి. ఈ రోజు ఆమె పుట్టినరోజు. బర్త్ డే సందర్భంగా ఆమె నటిస్తున్న ఆరు సినిమాల పోస్టర్లు విడుదల కావడం విశేషం. సాధారణంగా హీరోలకు ఇలా జరుగుతుంది. కానీ, శ్రీలీలకు ఉన్న పాపులారిటీ వల్ల ఆమెకి ఇలా జరిగింది.

ఈ రోజు విడుదలైన సినిమాల పోస్టర్లు ఇవే…

sreeleela 6posters
  1. ఉస్తాద్ భగత్ సింగ్ (పవన్ కళ్యాణ్ సరసన మూవీ)
  2. గుంటూరు కారం (మహేష్ బాబు సరసన)
  3. నితిన్ 32వ చిత్రం
  4. రామ్ – బోయపాటి చిత్రం
  5. భగవంత్ కేసరి (బాలయ్య చిత్రంలో కూతురిగా)
  6. ఆదికేశవ (వైష్ణవ్ తేజ సరసన)