
హీరోయిన్ శ్రీలీల టాలీవుడ్ లో చాలా క్రేజున్న హీరోయిన్. ఒక విధంగా చెప్పాలంటే టాప్ హీరోయిన్ లలో ఒకరు. కానీ ఆమెకున్న టెన్షన్లు ఆమెకు ఉన్నాయి. విజయాల శాతం తగ్గుతోంది అన్న బాధ ఉంది. వచ్చే శుక్రవారం ఆమెకి మరో పరీక్ష. నవంబర్ 24న “ఆదికేశవ” విడుదల కానుంది.
వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన “ఆదికేశవ” సినిమాకి ఇప్పటివరకు హైప్ లేదు. మేకర్స్ ప్రమోషన్ చేస్తున్నారు కానీ సరైన బజ్ రావడం లేదు. ఇక ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ రాబట్టడంలో శ్రీలీలకున్న పాపులారిటీనే ఉపయోగపడాలి. ఎందుకంటే హీరో వైష్ణవ్ తేజ్ కి మొదటి చిత్రం తప్ప మరో హిట్ లేదు. ఆయనకి క్రేజ్ కూడా లేదు. శ్రీలీలనే ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ మరి.
రామ్ హీరోగా బోయపాటి తీసిన “స్కంద” ఆడలేదు. కానీ బాలయ్యకి కూతురు వరుసయ్యే పాత్రలో నటించి మెప్పించింది. “భగవంత్ కేసరి” మంచి విజయం సాధించింది. నటిగానూ మార్కులు కొట్టేసింది. ఐతే, రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్రల్లో విజయం సాధించడం ముఖ్యం. ఎందుకంటే ఆమెకి స్టార్ హీరోయిన్ గా పేరుంది. దాన్ని నిలబెట్టుకోవాలి కదా. పైగా, ఆమె నటించిన చిత్రాలు వరుసగా విడుదల అవుతున్నాయి. “స్కంద”, “భగవంత్ కేసరి”, తర్వాత ఈ ఏడాది ఆమెకిది మూడో విడుదల.
మరి ఈ సినిమా విజయం సాధిస్తుందా? అదే ఆమెకున్న టెన్షన్.