షారుక్ తో యష్? అబ్బే తప్పు!

- Advertisement -
SRK and Yash


“KGF” హీరో యష్ ఇటీవలే తన కొత్త సినిమాని ప్రకటించాడు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో “టాక్సిక్” (Toxic) పేరుతో కొత్త సినిమాని సెట్ చేసుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు, ఇతర పాత్రధారులు ఎవరు అనే విషయాలని ఇంతవరకు వెల్లడించలేదు.

కరీనా కపూర్ హీరోయిన్ గా నటించనుంది అని ఆ మధ్య వార్తలు వచ్చినా వాటిని తోసిపుచ్చుంది కరీనా.

ఇక తాజాగా షారుక్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు అనే మాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా యష్ ని బెంగుళూర్ మీడియా ప్రశ్నించింది. “ఈ సినిమాలో నటించే వారి పూర్తి వివరాలు త్వరలోనే మా టీం వెల్లడిస్తుంది. అప్పటివరకు మీడియా ఆగాలి. పూర్తిగా కన్ఫర్మ్ కాని వాటిని ప్రచారంలోకి తీసుకురావద్దు,” అని యష్ చెప్పాడు.

తమ సినిమాలో షారుక్ నటించడం లేదని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. అలాగే ఇటీవల సూపర్ హిట్టైన “హనుమాన్” తెలుగు చిత్రానికి సీక్వెల్ గా రూపొందే “జై హనుమాన్” చిత్రంలో తాను హనుమంతుడిగా నటించబోతున్నట్లు వచ్చిన వార్తలను కూడా అబద్దమే అని తేల్చాడు యష్.

More

Related Stories