ఆమెతో ఆ ప్లాన్స్ ఉన్నాయి: సుధీర్

Sudheer

బుల్లి తెర ప్రేక్ష‌కుల‌కు ఫెవరెట్ సుడిగాలి సుధీర్. అక్కడ స్టార్డం పొంది వెండితెరపై హీరోగా రాణించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే హీరోగా ఒక విజయం అందుకున్నాడు. ఇప్పుడు ‘కాలింగ్ సహస్ర’ అనే సినిమాతో మన ముందుకొస్తున్నాడు. డిసెంబ‌ర్ 1న రిలీజ్ కానుంది.

ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా మీడియాతో ఈ సినిమా గురించి ముచ్చటించాడు. అలాగే తనకి “జోడిగా” బుల్లితెరపై క్రేజ్ తెచ్చుకున్న రష్మీ గౌతమ్ తో కూడా సినిమాల్లో నటిస్తాను అంటున్నాడు.

“రష్మీ గురించి అడగకుండా మీడియా ఉండదు కదా. ఆమెతో మంచి సినిమా చేసే ప్లాన్స్ ఉన్నాయి. మా కాంబినేషన్ కి ఉండే క్రేజ్ కి తగ్గ సినిమా చేస్తాం,” అని సుధీర్ అన్నాడు.

అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి “కాలింగ్ సహస్ర”ని నిర్మిస్తున్నారు. సుధీర్ స‌ర‌స‌న డాలీషా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

కాలింగ్ సహస్ర ట్రైలర్ కి కింద క్లిక్ చేయండి.

More

 

Related Stories