సూపర్‌స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని విజయవాడలో నెలకొల్పారు. ఐతే, ఈ విగ్రహ ఆవిష్కరణ మహేష్ బాబు చేతుల మీదుగా కాకుండా కమల్ హాసన్ ద్వారా జరగడం విశేషం.
కమల్ హాసన్ శుక్రవారం ఉదయం విజయవాడలో కృష్ణ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విజయవాడలో “భారతీయుడు 2” సినిమా షూటింగ్ జరుగుతోంది. విజయవాడలో కమల్ ఉండడంతో కృష్ణ గారి అభిమానులు ఆయన్ని కలిసి విగ్రహ ఆవిష్కరణ చెయ్యాలని కోరారు. వెంటనే కమల్ అంగీకరించారు. ఈ కార్యక్రమంలో దేవినేని అవినాష్ పాల్గొన్నారు.
ఈ వేడుకని చూసేందుకు సూపర్ స్టార్ అభిమానులు, శ్రేయోభిలాషుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అనంతరం ట్విట్టర్ వేదిక ద్వారా మహేష్ బాబు కమల్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఐతే, మహేష్ బాబు – ఘట్టమనేని కుటుంబం నుంచి ఎవరూ ఈ విగ్రహ ఆవిష్కరణకు ఎందుకు వెళ్లలేదో మరి!
Satyadev's "Rao Bahadur" earned widespread appreciation from critics. However, being a niche, content-driven film rather…
"Nagabandham" has grossed nearly Rs 11 crore worldwide during its opening weekend, an impressive feat…
"Varanasi" and "Raaka" are among the most anticipated Indian films currently in production, carrying enormous…
Director Trivikram Srinivas recently announced a mythological film with NTR, tentatively titled "God of War".…
“Rao Bahadur", starring Satyadev and directed by Venkatesh Maha, continues to receive appreciation following its…
"Hanumat Sundarakanda", presented by Aindri Creations, is being produced by Nischitha Sethu and Harinath Devara.…