కమల్ ఆవిష్కరించిన కృష్ణ విగ్రహం

సూపర్‌స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని విజయవాడలో నెలకొల్పారు. ఐతే, ఈ విగ్రహ ఆవిష్కరణ మహేష్ బాబు చేతుల మీదుగా కాకుండా కమల్ హాసన్ ద్వారా జరగడం విశేషం.

కమల్ హాసన్ శుక్రవారం ఉదయం విజయవాడలో కృష్ణ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విజయవాడలో “భారతీయుడు 2” సినిమా షూటింగ్ జరుగుతోంది. విజయవాడలో కమల్ ఉండడంతో కృష్ణ గారి అభిమానులు ఆయన్ని కలిసి విగ్రహ ఆవిష్కరణ చెయ్యాలని కోరారు. వెంటనే కమల్ అంగీకరించారు. ఈ కార్యక్రమంలో దేవినేని అవినాష్ పాల్గొన్నారు.

ఈ వేడుకని చూసేందుకు సూపర్ స్టార్ అభిమానులు, శ్రేయోభిలాషుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అనంతరం ట్విట్టర్ వేదిక ద్వారా మహేష్ బాబు కమల్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఐతే, మహేష్ బాబు – ఘట్టమనేని కుటుంబం నుంచి ఎవరూ ఈ విగ్రహ ఆవిష్కరణకు ఎందుకు వెళ్లలేదో మరి!

Advertisement
 

More

Related Stories