సూర్య నిర్మాతగా మరో బ్యానర్?

TeluguCinema 30 Sep 2025
Suriya 4

హీరో సూర్య చాలా కాలంగా తన సోదరుడు, తన కజిన్స్, తన భార్య నిర్మించే సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ (సూర్య బంధువు జ్ఞానవేల్ రాజాది), 2D ఎంటర్ టైన్మెంట్స్ (భార్య జ్యోతిక కలిపి పెట్టిన సొంత నిర్మాణ సంస్థ), డ్రీం వారియర్ పిక్షర్స్ (కజిన్ నిర్మాణ సంస్థ)… ఇవే సూర్య చేసిన చిత్రాలు. ఐతే ఇటీవల “కంగువ” వంటి భారీ అపజయాల తర్వాత వేరే నిర్మాతలకు సినిమాలు చెయ్యడం మొదలుపెట్టాడు.

ప్రస్తుతం తెలుగులో దర్శకుడు వెంకీ అట్లూరితో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి నాగవంశీ నిర్మాత. అలాగే మరో సినిమాకి మరో తమిళ నిర్మాత.

ఐతే, ఇప్పుడు ళకారం పేరుతో ఒక కొత్త బ్యానర్ పెడుతున్నాడట. ఈ బ్యానర్లో రెండు కొత్త సినిమాలు చేస్తాడట. తన భార్యకి 2D ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఇచ్చేసి తాను ఈ కొత్త బ్యానర్లో సినిమాలు చేస్తాడట.

ఈ సడెన్ నిర్ణయం వెనుక కారణం ఏంటో మరి? ఇప్పటికే సూర్య చెన్నై వదిలి ముంబైలో ఉంటున్నాడు. షూటింగ్ లేమో ఎక్కువగా హైదరాబాద్ లో చేస్తున్నాడు.