ఐపీఎల్ భామలు వీళ్ళే!

TeluguCinema 27 Mar 2023
tamannah stills 150323 005

ఈ నెల 31న ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. గౌహతి నగరంలోని బర్సాపర స్టేడియంలో ఐపీఎల్ మొదటి ఆట మొదలవుతుంది. ఈ ప్రారంభోత్సవానికి సినిమా తారల గ్లామర్ కూడ తోడు కానుంది.

మిల్క్ బ్యూటీ తమన్న, “నేషనల్ క్రష్”గా పేరొందిన రష్మిక మందాన ఓపెనింగ్ ఈవెంట్ కి హాజరయ్యి డ్యాన్స్ షోలో పాల్గొంటారు. వీరే ఈ సారి ఐపీఎల్ భామలు.

తమన్న ఇప్పటికే తన డ్యాన్స్ రిహార్సల్ మొదలు పెట్టింది. రష్మిక కూడా తన సినిమాలోని పాటలకు డ్యాన్స్ చెయ్యనుంది. ‘పుష్ప’ సినిమాలోని “సామి సామి” సాంగ్ నార్త్ ఇండియాలో బాగా పాపులర్ అయింది. ఆమెతో అదే పాటకు డ్యాన్స్ చేయిస్తారని టాక్.

రష్మిక, తమన్న ఈ షోలో డ్యాన్స్ చేస్తున్నందుకు భారీ మొత్తం తీసుకుంటున్నారు. వాళ్ళు సినిమాకి తీసుకునే పారితోషికంలో సగం మొత్తం ఒక్క రోజులో సంపాదించనున్నారు

Rashmika

ఈ ఐపిఎల్ లో 10 టీంలు తలపడుతాయి. గుహహతి స్టేడియంలో ఐపీఎల్ జరగడం ఇదే మొదటిసారి. మొత్తం 12 స్టేడియంలలో ఐపీఎల్ ఆడుతారు ఈసారి. మే 28న ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరుగుతుంది.