తమన్న కస్సు బస్సు!

Tamannaah Bhatia

ఆయన, నేను కలిసి కనిపిస్తే, కలిసి నటిస్తే లవర్స్ అయిపోతామా? మీడియా అలా వార్తలు రాయొచ్చా అంటూ తమన్న మాట్లాడుతోంది.

ఇలాంటి మాటలు అన్నీ రొటీన్ అయిపోయాయి. జనం మారిపోయారు. అయినా తమన్న అలాగే మాట్లాడుతోంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె డేటింగ్ లో ఉందని మీడియా వార్తలు రాస్తుండడంతో ఆమె కస్సుబుస్సులాడుతోంది.

ఐతే, మీడియాలో వార్తలు రావడానికి ఆధారం ఉంది. డిసెంబర్ 31న గోవాలో న్యూ ఇయర్ పార్టీకి విజయ్ వర్మతో ఆమె వెళ్ళింది. ఇద్దరూ లిప్ టు లిప్ కిస్సులు పెట్టుకుంటూ డ్యాన్స్ లు చేశారు. చుట్టూ ఇతరులు కూడా ఉన్నారు. ఆ పార్టీకి వచ్చిన వారంతా లవర్స్, పెళ్ళైన జంటలే. మరి వీళ్లిద్దరి మధ్య ఏమి లేకుండానే ఆ పార్టీకి వెళ్లి ఒకరు పెదాలు మరొకరు అందుకున్నారా?

ఆ వీడియో బయటికి వచ్చిన తర్వాత కూడా ఆమె ఇంకా కహానీలు చెప్పడం విచిత్రంగానే ఉంది.

తమన్నకిప్పుడు 33 ఏళ్ళు. పెళ్లి గురించి తల్లితండ్రులు అడుగుతున్నారట. ఆ విషయాన్నీ ఆమె ఇంతకుముందు చెప్పింది. మరి, ఇలాంటి టైంలో మరో నటుడితో ముద్దులు పెట్టుకుంటూ షికార్లు చేస్తుంటే పుకార్లు రాకుంటే ఏమి వస్తాయి?

Advertisement
 

More

Related Stories