ముద్దుసీన్లు చేస్తోంది అందుకే: తమన్న

Tamannaah Bhatia

తమన్న ఈమధ్య తనలోని 2.O చూపిస్తున్న సంగతి తెలిసిందే. కట్టుబాట్లు పక్కనపెట్టి అందాల ప్రదర్శన చేస్తోంది. హాట్ హాట్ గా పొటోలకు పోజులిస్తోంది. పనిలోపనిగా లిప్ కిస్సులకు కూడా ఓకే చెప్పింది. ఓ వెబ్ సిరీస్ లో చాలా బోల్డ్ గా నటించింది.

తమన్నాలో ఎందుకింత మార్పు, ఉన్నఫలంగా ఇప్పుడే ఎందుకిలా మారిపోయిందని చాలా మందిలో డౌట్స్. దీనికి తమన్న ఇప్పటికే సమాధానం ఇచ్చింది.

మడి కట్టుకొని కూర్చుంటే పనులు జరగట్లేదంటూ గతంలోనే స్పందించిన ఈ బ్యూటీ, తాజాగా మరోసారి తన వెర్షన్ బయటపెట్టింది.

కెరీర్ ప్రారంభం నుంచి చాన్నాళ్ల పాటు తనకంటూ కొన్ని నిబంధనలు పెట్టుకుందంట తమన్న. అయితే కాలక్రమంలో తన రూల్స్ తనకే అడ్డంకిగా మారాయంట. మరీ ముఖ్యంగా కొన్ని మంచి పాత్రల్ని చేజార్చుకుందట.అందుకే రూల్స్ అన్నీ పక్కనపెట్టానని, క్యారెక్టర్ బాగుంటే ఎలాంటి సన్నివేశంలోనైనా నటిస్తానని చెబుతోంది.

ఇందులో భాగంగానే ముద్దు సీన్లకు కూడా ఓకే చెప్పానని అంటోంది మిల్కీ బ్యూటీ.

ఏజ్ తో పాటే రూల్స్!

Tamannaah Bhatia

ఆ మధ్య ఆమె నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉంది. ఆ ప్రేమ మాయలో పడి విజయ్ వర్మ కోసమే ఆమె తన రూల్స్ ని పక్కన పెట్టి అతనితో హాట్ హాట్ గా నటించింది అనే కామెంట్స్ ఉన్నాయి. ఐతే అది కరెక్ట్ కాదేమో ఎందుకంటే ఆ తర్వాత వేరే నటులతో కూస్తో ముద్దు సీన్లు చేసింది తమన్న.

35 ఏళ్ల ఈ భామ తనకి వేరైటీ పాత్రలు కావాలని అంటోంది. అందుకే ఇలా రూల్స్ మారాయి.

More

 

Related Stories