కరోనా కాలంలో తమన్న చక్కర్లు


ఇది కరోనా కాలం. ఈ టైంలో ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసేందుకు జంకుతున్నారు జనం. కానీ తమన్న మాత్రం ఒక రోజు హైదరాబాద్ లో, మర్నాడు ముంబైలో, ఇంకోరోజు బెంగుళూరు అన్నట్లుగా చక్కర్లు కొడుతోంది. ఈ కరోనా టైంలో కూడా ఆగకుండా షూటింగ్ ల్లో పాల్గొంటోంది.

లక్డౌన్ ఎత్తేయగానే ఆమె నితిన్ హీరోగా రూపొందుతోన్న ‘మాస్ట్రో’ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి, పూర్తి చేసింది. హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ ముగియగానే, ముంబై వెళ్లి ఒక రోజు రెస్ట్ తీసుకొని మళ్ళీ బెంగుళూరులో ల్యాండ్ అయింది. అక్కడ ‘మాస్టర్ చెఫ్ ఇండియా’ తెలుగు వర్షన్ కి సంబంధించిన ప్రోమో షూట్ లో పాల్గొంది.

‘మాస్టర్ చెఫ్’ తెలుగు ప్రోగ్రామ్ కి ఆమె హోస్ట్. తమన్నకిది మొదటి టీవీ షో.

ఇక జులై మొదటివారంలో ఆమె మళ్ళీ హైదరాబాద్ రావాలి. “ఎఫ్ 3” సినిమా షూటింగ్ జులై 1న ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఆమె వెంకటేష్ సరసన నటిస్తోంది. ఇలా…. మూడు, నాలుగు నగరాలు చక్కర్లు కొడుతోంది. ఆమెకి గతేడాది మొదటి వేవ్ లోనే కరోనా వచ్చి, తగ్గింది.

Advertisement
 

More

Related Stories