వెబ్ డ్రామాలతో తమన్న బిజీ

TeluguCinema 06 May 2021
Tamannah

తమన్న వెబ్ సిరీస్ లు, వెబ్ డ్రామాలు ఫుల్లుగా ఒప్పుకుంటోంది. ఇప్పటికే తెలుగులో ’11th Hour’ అనే వెబ్ సిరీస్ చేసింది. మరోటి కూడా లైన్లో ఉంది. ఇప్పుడు తమిళ్ లో కూడా నటించింది. ఆమె తమిళ్ లో చేసిన మొదటి వెబ్ ‘నవంబర్‌ స్టోరీ’.

ఆనంద వికటన్ ప్రొడక్షన్స్ సంస్థ తీస్తున్న ఈ వెబ్ డ్రామా ట్రైలర్‌ వచ్చింది. హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ నెల 20న రిలీజ్.

తమన్న హీరోయిన్ గా కూడా బిజీగానే ఉంది. వచ్చిన ప్రతి అఫర్ ని వదులుకోవడం లేదు. సత్యదేవ్ సరసన ‘గుర్తుందా శీతాకాలం’, గోపీచంద్ సరసన ‘సీటిమార్’ నటిస్తోంది.