బాలీవుడ్ వైపు తేజ అడుగులు

- Advertisement -
Teja

దర్శకుడు తేజ మళ్ళీ బిజీ అవుతున్నారు. ఇప్పటికే తెలుగు సినిమాలు చేతిలో ఉన్నాయి. అలాగే, బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. దర్శకుడు తేజకి ఆఫర్లు అలా ఉన్నాయి అని చెప్తున్నారు. రెండు బాలీవుడ్ సంస్థలు ఆయన దర్శకత్వంలో నిర్మాణం చేసేందుకు ముందుకు వచ్చాయట.

ఇంతకీ తేజ హిందీలో ఏమి చెయ్యబోతున్నారు? ఒక మూవీ, ఒక వెబ్ సిరీస్! జకామి (గాయం) అనే హిందీ చిత్రం, తస్కరి అనే వెబ్ సిరీస్ తీయనున్నారట. ఒకప్పుడు బాలీవుడ్ లో పలు చిత్రాలకు ఆయన కెమెరామెన్ గా పనిచేశారు. 20 ఏళ్ల క్రితం ఆయన బాలీవుడ్ లో లీడింగ్ కెమెరామన్. కానీ, ‘చిత్రం’ సినిమాతో దర్శకుడిగా మారక, బాలీవుడ్ వైపు చూపు వెయ్యలేదు.

తేజ ఇటీవల రానా సోదరుడు అభిరాం హీరోగా ‘అహింస’ అనే సినిమా తీశారు. ఆ షూటింగ్ పూర్తి అయింది. విడుదల తేదీ ఇంకా ఫిక్స్ కాలేదు. ప్రస్తుతం, తన కుమారుడిని పరిచయం చేస్తూ మరో తెలుగు చిత్రం డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ రెండు తెలుగుసినిమాలు విడుదలయ్యాక బాలీవుడ్ వైపు వెళుతాడట.

More

Related Stories