‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్ విడుదల

తిరువీర్, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పి.ఎం.ప్రొడక్ష్సన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న సినిమా రిలీజ్ కానుంది. టీజర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు.
విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో చిత్ర యూనిట్‌ని అభినందించారు.
‘ఇదేన్నా మా ఊళ్లో రమేష్ ఫొటో స్టూడియో’ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ‘ఈ మండలం మొత్తంలో బర్త్ డే అయినా, వెడ్డింగ్ అయినా, ప్రీ వెడ్డింగ్ అయినా మన దగ్గరే చేయించుకుంటారన్నా..’ అనే డైలాగ్‌తో హీరో క్యారెక్టరైజేషన్‌ను రివీల్ చేశారు.
తిరువీర్, టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ యాక్టింగ్ ఆకట్టుకుంటోంది. సురేష్ బొబ్బిలి సంగీతం, నేపథ్య సంగీతం, కె.సోమ శేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఎసెట్ అవుతున్నాయి. నరేష్ అడుప ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.