సామ్ ఇప్పుడెందుకు రెచ్చిపోతోంది?

Samantha

సమంత ఉన్నట్టుండి గ్లామర్ డోస్ పెంచింది. గత వారం రోజులుగా స్కిన్ షోతో కూడిన ఫోటోలు, వీడియోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. లెగ్స్ ప్రద్రర్శన సహా ఫుల్లుగా ఎక్స్ పోజింగ్ తో వింటర్లో హీటెక్కిస్తోంది. సడెన్ గా ఆమె ఇలా మారిపోవడానికి రీజన్ ఏంటి అనేదే అందరి డౌట్.

నెల రోజుల క్రితం భర్త నాగ చైతన్యతో కలిసి మాల్దీవులకు వెళ్ళింది. అక్కడ నుంచి చాలా ఫోటోలు పోస్ట్ చేసింది. కానీ బికినీ ఫోటోలు పెట్టేందుకు వెనుకాడింది. అంత కేర్ ఫుల్ గా ఉన్న ఈ అక్కినేని భామ ఇప్పుడు ఎందుకిలా రెచ్చిపోతోంది? ఈ ప్రశ్నకి సమాధానం ఉంది మరి.

ఇదంతా.. ఆమె ఒక బ్రాండ్ కోసమే ఇలా చేస్తోందట. ఆ బ్రాండ్ ప్రొమోషన్ కోసమే ఈ గ్లామర్ అవతారం. సో.. ఇదంతా మనీ మ్యాటర్ అన్నమాట.

ALSO Check: Samantha’s sizzling glam avatar Photos

మరోవైపు, సినిమాల్లో మళ్ళీ నటించడం కూడా షురూ చేసింది. 2019 డిసెంబర్ లో ఆమె “జాను” సినిమా షూటింగ్ పూర్తి చేసింది. మళ్లీ సరిగ్గా ఏడాది తర్వాత మూవీ సెట్ మీదకు వచ్చింది. గతవారం ఆమె తన తమిళ్ సినిమా షూటింగ్ లో పాల్గొంది. తెలుగులో ఆమె నందిని రెడ్డి డైరెక్షన్ లోనే మరో సినిమా స్టార్ట్ చేస్తుందట. అది నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

More

Related Stories