వేదిక టార్గెట్ ఏంటో?

- Advertisement -

వేదిక ఈ తరుణం మళ్ళీ రాదిక అని అనుకుంటుందా? వయసులో ఉన్నప్పుడే, ఫిజిక్ సూపర్ గా ఉన్నప్పుడే గ్లామర్ షో చెయ్యాలనుకుంటుందా? 30 ఏళ్ళు దాటినా ఈ సుందరి ఇటీవల తెగ ఎక్స్పోజ్ చేస్తోంది.

సినిమాల్లో కన్నా… ఇన్ స్టాగ్రామ్ వేదికపై వేదిక ఎందుకింత ఎక్స్పోజ్ చేస్తోంది అనేది అందరిలో మెదిలే ప్రశ్న. సింపుల్… ఇన్ స్టాగ్రామ్ ద్వారా కూడా బోలెడెంతగా సంపాదించుకోవచ్చు. ఎంతగా గ్లామర్ ఫోటోలు పెడితే అంతగా ఫాలోవర్స్ పెరుగుతారు. ఎంతగా ఫాలోవర్స్ పెరిగితే అంతగా సంపాదన ఉంటుంది.

Also Check: Vedhika Maldives Photos

ప్రస్తుతం మాల్దీవులకు వెళ్తున్న హీరోయిన్లకు ట్రిప్ మొత్తం మాల్దీవుల టూరిజమ్ కంపెనీలు భరిస్తున్నాయట. అక్కడి టూరిజం ప్రమోషన్ కోసం ఇలా చేస్తున్నాయి ఆ కంపెనీలు. అలాగే, ఫాలోవర్స్ బాగా ఉన్న హీరోయిన్లు, హీరోలతో తమ బ్రాండ్స్ ని ప్రచారం చేసుకుంటాయి కార్పొరేట్ కంపెనిలు. ఒక్కో పోస్ట్ కి లక్షల్లో రేట్ ఉంటుంది.

అందుకే వేదిక ఈ పద్దతిలో వెళ్తోంది.

 

More

Related Stories