Advertisement
తెలుగు న్యూస్

త్రిషకు పెరుగుతోన్న మద్దతు

హీరోయిన్ త్రిషకు సినిమా తారల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలువురు పేరొందిన తమిళ సెలెబ్రిటీలు ఆమెకి సపోర్ట్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మన్సూర్ అలీ ఖాన్ మాటలను తప్పు పట్టారు. తాజాగా నితిన్ వంటి తెలుగు హీరోలు కూడా త్రిషకి మద్దతుగా ట్విట్టర్ లో సందేశం పెట్టడం విశేషం.

ఇంతకీ మేటర్ ఏంటంటే… త్రిషపై కొన్ని కామెంట్స్ చేశారు మన్సూర్. విజయ్, త్రిష జంటగా నటించిన “లియో” చిత్రంలో మన్సూర్ కూడా నటించాడు. జైలు శిక్ష అనుభవిస్తున్న రౌడీ పాత్రలో మన్సూర్ ఆ సినిమాలో కనిపిస్తారు. ఐతే, ఆమెతో కనీసం ఒక్క బెడ్ రూమ్ సీన్ కూడా దక్కలేదని మన్సూర్ ఒక ఇంటర్వ్యూలో కామెంట్ చెయ్యడం పెద్ద దుమారం రేపింది.

ఐతే తన మాటలను వక్రీకరించారు అని తాజాగా మన్సూర్ అంటున్నారు.

“లియో సినిమాలో నేను నటించాను. కానీ త్రిషని ఎత్తుకొని బెడ్ రూమ్ వరకు తీసుకెళ్లే ఛాన్స్ దక్కలేదు. నేను కాశ్మీర్ షూటింగ్ షెడ్యూల్ లో ఉన్నన్ని రోజులు త్రిష ముఖం కూడా నాకు చూపించలేదు. నేను ఎందరో హీరోయిన్లను (సినిమాల్లో) రేప్ చేశాను. కానీ నాకు త్రిషను బెడ్ రూమ్ కి తీసుకెళ్లే ఛాన్స్ దక్కలేదు. అలాంటి ఫిగర్ ని ముట్టుకోలేదు,” అనే అర్థం వచ్చేలా మన్సూర్ అలీ ఖాన్ తన ఇంటర్వ్యూలో మాట్లాడారట.

దాంతో, త్రిష వెంటనే మన్సూర్ ఖాన్ ని చెడామడా తిట్టింది. మన్సూర్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నీతో నటించే సీన్లు లేకపోవడం నా అదృష్టం అంటూ ఘాటుగా పోస్ట్ పెట్టింది.

“లియో” సినిమా తీసిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా మన్సూర్ ని విమర్శించారు.

Advertisement

This post was last modified on November 20, 2023 1:27 pm

Advertisement
Share