ఆ సినిమాలు అటకెక్కినట్లే!

Trivikram

వెంకటేష్ – తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో సినిమా అని మూడేళ్ళుగా వినిపిస్తోన్న మాట. అలాగే, చిరంజీవి-పవన్ కళ్యాణ్ తో మూవీ అని, సూర్యతో ఒక మూవీ అని ఎలాగైతే అనౌన్స్ చేసారో అలాగే వెంకటేష్ తో ఒక మూవీ అని త్రివిక్రమ్ కొన్నాళ్ల క్రితం హంగామా చేశారు కానీ అవి ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.

ఇప్పుడు వెంకటేష్ ఆ సినిమాల గురించి మాట్లాడేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపడం లేదు. ‘నారప్ప’ సినిమా మీడియా ప్రొమోషన్ లో భాగంగా తరుణ్ భాస్కర్ మూవీ, త్రివిక్రమ్ మూవీ గురించి అడిగితే, “ఏది మన చేతిలో లేదమ్మా” అని తేల్చి చెప్పారు. తరుణ్ భాస్కర్ ఎదో రాస్తున్నాడని చెప్పిన వెంకటేష్.. త్రివిక్రమ్ గురించి పెద్దగా చర్చించేందుకు ఆసక్తి చూపకపోవడం విశేషం.

వెంకటేష్ ప్రస్తుతం “ఎఫ్ 3” షూటింగ్ లో ఉన్నారు. అది విడుదలైన తర్వాత మరో రీమేక్కో, లేదా ఆ టైంకి ఎవరు కథతో వస్తే వాళ్ళతో చేసే మూడ్ లో ఉన్నట్లు కనిపిస్తోంది.

త్రివిక్రమ్ కూడా పెద్ద హీరోలతోనే సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. మహేష్ బాబుతో నెక్స్ట్ మూవీ మొదలు పెడుతారు. ఆ తర్వాత రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ … ఇలా ఉండొచ్చు లైనప్.

Advertisement
 

More

Related Stories