త్రివిక్రమ్ పాత వీడియో వైరల్

trivikram20years20

త్రివిక్రమ్ తీస్తున్న “గుంటూరు కారం” సినిమా ఆగుతూ… సాగుతూ … వెళ్తోంది. ఈ సినిమాని మొదలు పెట్టినప్పటి నుంచి ఏవో సమస్యలు. త్రివిక్రమ్ కెరీర్ లోనే మొదటిసారిగా తన సినిమాని రెండు నెలల పాటు నిలిపివేసి కథలో మార్పులు చేశారు. హీరోయిన్ ని మార్చేశారు. ఇలాంటివి అన్ని భరిస్తూ సినిమా తీస్తున్నారు.

మహేష్ బాబు హీరోగా మొదలైన ఈ సినిమాలో మొదట పూజ హెగ్డే, శ్రీలీలని హీరోయిన్లుగా తీసుకున్నారు. కానీ పూజ హెగ్డేపై పది రోజుల పాటు చిత్రీకరణ జరిపిన తర్వాత ఆమెని తొలగించి ఇప్పుడు శ్రీలీలని మెయిన్ హీరోయిన్ చేశారు. రెండో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.

ఐతే, మీనాక్షి చౌదరి మొదటి సినిమా ఫంక్షన్ లోనే ఆమె బిజీ అవుతుంది అని, ఆమె డేట్స్ కోసం తాను అడగాల్సి వస్తుందేమో అని త్రివిక్రమ్ అన్నారు. ఆమెకి గుడ్ లక్ చెప్తూ ఎదో ఊరికే అనేశారు అప్పుడు. కానీ అదే ఇప్పుడు నిజమైంది. ఆ వీడియోని జనం ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.

ఆమె మొదటి చిత్రం… ‘ఇచట వాహనములు నిలుపరాదు.’ సుశాంత్ హీరో. తన ‘అల వైకుంఠపురంలో’ సుశాంత్ నటించాడు కాబట్టి త్రివిక్రమ్ ఆ సినిమా ఈవెంట్ కి అతిథిగా వెళ్లారు. అది ఆడలేదు. ఆ తర్వాత ఈ భామ ‘హిట్ 2’లో అడవి శేష్ సరసన నటించింది. అది విజయం సాధించింది.

Advertisement
 

More

Related Stories