అతన్ని బాస్ట** అని తిట్టిన అనసూయ

Anasuya

అనసూయకి అభిమానులు ఎక్కువే. అలాగే ఆమెని ట్రోల్ చేసే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే. ఆమెని రకరకాలుగా తిడుతుంటారు కొందరు. ఆమెకి పబ్లిసిటీ పిచ్చి అని కామెంట్ చేసే వాళ్ళు బోలెడు. ఐతే, అలాంటి ట్రోలింగ్ ని పెద్దగా పట్టించుకోదు అనసూయ. కానీ ఎవరైనా గీత దాటి, బూతులు తిడితే… ఆమె కూడా గట్టిగానే సమాధానం ఇస్తుంటుంది. ఆమె కూడా బూతులతోనే రిప్లై ఇస్తుంది.

లేటెస్ట్ గా ఒక పాత వీడియోని బయటికి తీసి, ఆమెని ట్రోల్ చేశాడు ఒక ట్విట్టర్ యూజర్. పబ్లిసిటీ కోసం ఇలాంటి చీప్ గిమ్మిక్కులు చేస్తుంటుంది అని అన్నాడు. అక్కడితో ఊరుకోలేదు. ఏకంగా ఆమెని బి* అని తిట్టాడు. దాంతో అనసూయకి కోపం నషాళానికి ఎక్కింది. అతనికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది అనసూయ.

నన్ను బి* అంటే.. నిన్ను ‘బాస్ట**’ అంటాను అని ఆమె కూడా బూతులు వాడింది.

అనసూయ ప్రస్తుతం ‘ఖిలాడీ’ సినిమాలో నటిస్తోంది. అలాగే కృష్ణవంశీ తీస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.

More

Related Stories