నరేష్ తో వర్షిణి ‘ఆ సీన్’

60 ప్లస్ ఏజ్ లో నరేష్ సినిమాల్లో తండ్రి పాత్రలే పోషిస్తున్నారు. కానీ నిజ జీవితంలో నటి పవిత్రని పెళ్లి చేసుకొని తాను ఈ వయసులో కూడా రొమాంటిక్ పర్సన్ ని అని నిరూపించుకున్నాడు.
తాజాగా “ఏనుగుతొండం ఘటికాచలం” అనే సినిమాలో రిటైరైన వ్యక్తి పాత్రలో నటించారు. ఆ వయసులో వయసులో ఉన్న వర్షిణి సౌందర్ రాజన్ పెళ్లి చేసుకుంటాడు (సినిమాలో). ఆమె నరేష్ తో “బెడ్ రూమ్” సీన్లలో కూడా నటించిందట. ప్రస్తుతం ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతోంది.
సినిమా ఎలా ఉందో కానీ కుర్రాళ్ళు సోషల్ మీడియాలో వర్షిణి, నరేష్ బెడ్ రూమ్ క్లిప్స్ ని తెగ షేర్ చేస్తున్నారు. ముసలోడికి దసరా పండగ అంటూ కామెంట్లు పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు.
వర్షిణికి 31 ఏళ్ళు. నరేష్ కి 65 ఏళ్ళు. వీరి మధ్య దర్శకుడు రవిబాబు ఇలాంటి బెడ్ రూమ్ సీన్లు పెట్టి కుర్రాళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడన్నమాట.