
వరుణ్ తేజ్ ఇటీవల అన్నీ ఫ్లాపులే చూశాడు. దాంతో, తన స్టయిల్ ని మార్చాడు. యాక్షన్ చిత్రాలను వదిలి హారర్ కామెడీవైపు వచ్చాడు. ప్రస్తుతం అలాంటి చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ సినిమాకి “కొరియన్ కనకరాజు” అనే పేరు అనుకుంటున్నారు. కొరియా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది ఈ మూవీ.
మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో, UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగు ప్రస్తుతం హైదరాబాదులో శరవేగంగా జరుగుతోంది వరుణ్ తేజ్ తో పాటు “మిరాయి” ఫేమ్ రితిక నటిస్తోంది.
ఈ సినిమా వరుణ్ కెరీర్‌లోనే వెరీ స్పెషల్ గా ఉండబోతోంది. హారర్–కామెడీ, ఇండియన్ , కొరియన్ బ్యాక్డ్రాప్, యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ‘తొలిప్రేమ’ తర్వాత వరుణ్ – థమన్ కాంబోలో వస్తున్న సినిమా ఇది.





