ఆమెతో వరుణ్ తేజ్ పెళ్లా!

Varun Tej

హీరో వరుణ్ తేజ్ పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. సరిగ్గా ఇదే రోజు ఒక వార్త గుప్పుమంది. ఈ రోజు ఆయన తన పెళ్లి గురించి ఒక ప్రకటన చేస్తాడని అనేది దాని సారాంశం.

వరుణ్ తేజ్ తనతో నటించిన ఒక భామతో డేటింగ్ లో ఉన్నాడని చాలా కాలంగా ఫిలింనగర్ లో వినిపిస్తున్న మాట. గతంలోనే పలు వెబ్ సైట్స్ లో ఈ వార్తలు వచ్చాయి. కానీ వరుణ్ తేజ్ కానీ, ఆ హీరోయిన్ కానీ లైట్ తీసుకున్నారు. మళ్ళీ వాళ్లిద్దరూ కలిసి నటించలేదు. కలిసి ఒకే చోట కనిపించలేదు. ఇప్పుడు ఏకంగా పెళ్లి అనే వార్త ప్రచారంలోకి వచ్చింది.

వరుణ్ తేజ్ కిప్పుడు 32 ఏళ్ళు. ఏడాది క్రితమే ఆయన సోదరి నిహారిక పెళ్లి ఘనంగా జరిగింది. దాంతో, వరుణ్ తేజ్ పెళ్లిపై ఫోకస్ పడింది.
ఈ హీరో ప్రస్తుతం ‘గని’, ‘ఎఫ్ 3’ సినిమాల్లో నటిస్తున్నాడు. కెరియర్ మంచి ఊపులో ఉంది. వరుణ్ తేజ్ మరి కొత్త ప్రచారంపై ఎలా స్పందిస్తాడో చూడాలి.

ఇది గాసిప్ గానే మిగులుతుందా? నిజమవుతుందా? అనేది చూడాలి.

Advertisement
 

More

Related Stories