వెబ్ లో కూడా రీమేక్కేనా రాజా!

TeluguCinema 22 Sep 2021
Venkatesh and Rana


వెంకటేష్ కి ‘రీమేక్ రాజా’ అనే పేరుంది. ఆయన దగ్గరికి వెళ్లి కొత్త కథలు చెప్తే ఓకే చేసేందుకు సతాయిస్తారని టాక్. అదే, ఇతర భాషల్లో హిట్టైన సినిమాలను పట్టుకొని వెళ్తే వెంటనే అంగీకారం తెలుపుతారట. ఇలాంటి ప్రచారంలో నిజమెంతో కానీ ఆయన ఎక్కువగా రీమేకులు చేస్తారనేది వాస్తవం. ఆయన ఫిల్మోగ్రఫీనే చెప్తోంది ఈ నిజం.

వెంకటేష్ ఈ ఏడాది ఇప్పటికే “నారప్ప” విడుదల చేశారు. త్వరలోనే “దృశ్యం 2” తెస్తున్నారు. ఈ రెండూ రీమేక్ చిత్రాలే అని స్పెషల్ గా మెన్షన్ చెయ్యక్కర్లేదు కదా. మరోవైపు, నెట్ ఫ్లిక్స్ కోసం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. రానా, వెంకటేష్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. “రానా నాయుడు” పేరుతో రూపొందే ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రారంభం అవుతుంది. ఈ రోజు ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు.

ఐతే, ఇది కూడా రీమేక్ కావడం విశేషం. “రే డోనావన్” (Ray Donovan) అనే అమెరికన్ క్రైం సిరీస్ కిది భారతీయ వర్షన్ అని మేకర్స్ స్వయంగా ప్రకటించారు. అంటే వెంకీ …వెబ్ లో కూడా ఒరిజినల్ కథ కాకుండా ‘ఆల్రెడీ తీసి విజయం సాధించిన కథ’నే ఒప్పుకున్నారన్నమాట. ఎక్కడైనా రీమేకేనా రాజా!

వెంకటేష్ “ఎఫ్ 2” వంటి స్ట్రెయిట్ సినిమాలు కూడా చేస్తున్నారు అనుకోండి. కానీ తెలుగు హీరోల్లో ఎక్కువ రీమేకులు చేసిన వారి జాబితాలో ఈ బొబ్బిలి రాజా ముందు వరుసలో ఉంటారు.

ALSO READ: Venkatesh and Rana team up for Netflix’s Rana Naidu