నా లావాదేవీలన్నీ ఈడీకి ఇచ్చాను: వీడీ

TeluguCinema 06 Aug 2025
Vijay Deverakonda

బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిన సెలెబ్రిటీలను ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో భాగంగా ఈ రోజు హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. నాలుగు గంటల విచారణ తర్వాత విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడారు.

ఆయన ఏమి చెప్పారంటే..

1) బెట్టింగ్ యాప్ కేసులో నా పేరు రావడం తో విచారణకు పిలిచారు. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ రెండు రకాలు ఉన్నాయి. నేను A23 అనే యాప్ గేమింగ్ యాప్ కి ప్రచారం చేశాను. బెట్టింగ్ యాప్స్ కి కాదు. నేను లీగల్ గా ఉన్న గేమింగ్ యాప్స్ ను మాత్రమే నేను ప్రమోట్ చేశాను

2) గేమింగ్ యాప్స్ అనేది దేశంలో చాలా రాష్ట్రాల్లో న్యాయబద్ధమే. గేమింగ్ యాప్స్ కి అన్ని ప్రభుత్వ అనుమతులు ఉంటాయి. మన దేశంలో గేమింగ్ యాప్స్ కబాడీ, వాలీ బాల్, ఐపీఎల్ ఈవెంట్లను స్పాన్సర్ చేస్తున్నారు

3) నా బ్యాంక్ లావాదేవీలు అన్ని కూడా ఈడీ కి సమర్పించాను . నేను ప్రమోట్ చేసిన A23 యాప్ అనేది తెలంగాణా లో ఓపెన్ కాదు. నేను చేసుకున్న కాంట్రాక్ట్, లీగల్ తీసుకున్న అమౌంట్ వాటి వివరాలు అన్ని ఈడీ కి ఇచ్చాను.