సైలెంట్ అయిపోయాడు!

TeluguCinema 04 Sep 2025
Vijay Deverakonda

విజయ్ దేవరకొండకి నమ్మిన దర్శకులు, నిర్మాతలే హ్యాండిస్తున్నారు. గుడ్డిగా నమ్మి సినిమాలు చేస్తూంటే అతనికి సరైన కంటెంట్ ఇవ్వడం లేదు. పాపం అతని నటన, ఎఫర్ట్స్ మాత్రం బాగుంటున్నాయి. కానీ విజయాలు రావడం లేదు. తాజాగా ‘కింగ్ డమ్” కూడా అంతే. ఎంతో కష్టపడి, ఇష్టపడి చేశాడు. కానీ సినిమా మూడు రోజుల మురిపెంలా జరిగింది. ఆ తర్వాత కలెక్షన్లే లేవు.

ఈ సినిమా తర్వాత ఇక సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.

ప్రస్తుతం దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తీస్తున్న పీరియడ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ షూటింగ్ సైలెంట్ గా మొదలైంది… పెద్దగా హడావిడి లేకుండా.

ఈ సినిమాలో మొదటిసారిగా రాయలసీమ యాసలో డైలాగ్ లు చెప్తాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఫలితం బాగుండాలంటే ఆయన మొత్తం అవుట్ ఫుట్ చూసుకోవాల్సిందే. దర్శకుడిని గుడ్డిగా నమ్మితే అంతే సంగతులు.