Advertisement
తెలుగు న్యూస్

యాత్ర 2, భైరవకోన పరిస్థితి ఏంటి?

సంక్రాంతి సందడి ఐదు చిత్రాల నుంచి నాలుగు చిత్రాలకు వచ్చింది. రద్దీ తగ్గింది. “ఈగిల్” సినిమాని సంక్రాంతి పోటీ నుంచి తప్పించారు ఇండస్ట్రీ పెద్దలు. అలా ఒప్పుకున్నందుకు “ఈగిల్” టీంకి ప్రతిఫలంగా ఒక మంచి డేట్ ఇస్తున్నామని పెద్దలు చెప్పారు. ఆ డేట్… ఫిబ్రవరి 9.

వేలంటైన్స్ డేని టార్గెట్ చేస్తూ ఫిబ్రవరి 9 తమ విడుదల తేదీ అని ఇంతకుముందు “టిల్లు స్క్వేర్” ప్రకటించింది. “ఈగిల్” కోసం “టిల్లు స్క్వేర్”ని ఫిబ్రవరి 9 నుంచి వాయిదా వేసేందుకు నిర్మాత నాగ వంశీ ఒప్పుకున్నారు. ఐతే, అదే రోజు అంటే ఫిబ్రవరి 9న మరో రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. అవి… యాత్ర 2, భైరవకోన.

“యాత్ర 2″…. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవిత చరిత్ర. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తీసిన చిత్రం ఇది. ఎన్నికలకు ముందు విడుదల చెయ్యాలనే ఉద్దేశంతోనే తీశారు. ఫిబ్రవరి ముగిసేలోపే సినిమా విడుదల కావాలి. ఎందుకంటే ఈ సినిమాకి ఎన్నికల కోడ్ భయం ఉంది. ఎన్నికల కోడ్ ఫిబ్రవరి చివరి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంచనా.

సో, “యాత్ర 2” ఫిబ్రవరి 9న కానీ ఫిబ్రవరి 16న కానీ రావొచ్చు.

సందీప్ కిషన్ హీరోగా రూపొందిన “ఊరు పేరు భైరవకోన” కూడా ఫిబ్రవరి 9న రానుంది. కానీ, “ఈగిల్” కారణంగా ఈ సినిమా కూడా వాయిదాపడక తప్పదు. “మమ్మల్ని అడగలేదు. మా పేరు కూడా దిల్ రాజు నిన్న ప్రెస్ మీట్ లో ప్రస్తావించలేదు. కాబట్టి మా “ఊరు పేరు భైరవకోన”ని వాయిదావెయ్యలేమ,”ని అనుకూల జర్నలిస్ట్ లతో వార్తలు రాయించుకున్నారు నిర్మాత అనిల్ సుంకర. ఐతే, అనిల్ సుంకర కున్న ఫ్లాపులు, సందీప్ కిషన్ కి ఉన్న ఫ్లాపులు రీత్యా వీరు అంత బెట్టు చేసే అవకాశం లేదు.

పరిశ్రమ “బాగు” కోసం మేము కూడా డేట్ మార్చుతున్నాం అని ఆ తర్వాత తాపీగా చెప్తారు అని ఒక టాక్ ఉంది.

Advertisement

This post was last modified on January 5, 2024 2:00 pm

Advertisement
Share