ఇండస్ట్రీ బాగు కోసం తప్పుకున్నారట!

Ravi Teja

జనవరి 13న విడుదల కావాల్సిన “ఈగిల్” సినిమా వాయిదా పడింది. ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఈ విషయాన్ని తాజాగా నిర్మాణ సంస్థ ప్రకటించింది. హీరో రవితేజ కూడా కొత్త పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

“బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం,” అని నిర్మాణ సంస్థ చెప్పుకొంది. “మొండోడి మనసు పుట్ట తేనే. తన నిర్మాత, పరిశ్రమ బాగు కోసం బరిని సంక్రాంతి నుండి Februaryకి తీసుకొచ్చాడు.మారింది తేది మాత్రమే మాసోడి mark కాదు,” అని సినిమాటిక్ స్టయిల్ ల్లో స్టేట్ మెంట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ.

“మన తెలుగు సినిమా పరిశ్రమ బాగు కోసం ఒక అడుగు వెనక్కి వేస్తున్నాను,” అని హీరో రవితేజ రాసుకున్నారు.

“ధమాకా” తర్వాత రవితేజ నటించిన సినిమాలు ఏవీ ఆడలేదు. వరుసగా మూడు చిత్రాలు – రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు – పరాజయం పాలు అయ్యాయి. ఇలాంటి టైంలో అన్ని చిత్రాలతో పోటీ పడడం కన్నా సోలోగా రావడమే బెటర్. ఆ విధంగా రవితేజ, ఆయన టీం సరైన నిర్ణయం తీసుకొంది.

Advertisement
 

More

Related Stories