అలియా స్థానంలో ఎవరు?

- Advertisement -
Alia Stills 180322 003


ఎన్టీయార్ – కొరటాల శివ సినిమాలో అలియా భట్ నటించడం లేదు. బాలీవుడ్ చిత్రాలు, తన కాపురం… వీటిపై దృష్టి పెడుతోంది అలియా. మొదట ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపింది. కానీ, ఇప్పుడు చెయ్యడం లేదు.

మరి అలియా బదులు ఎవరిని తీసుకుంటారు? ఇదే అందరిలో మెదులుతోన్న ప్రశ్న. అలియా స్థాయి హీరోయిన్ కావాలంటే బాలీవుడ్ నుంచే తీసుకోవాలి. లేదంటే ఇటు సౌత్ లో, అటు బాలీవుడ్ కి పరిచయమైన కియారా అద్వానీ, రష్మిక మందాన వంటి వారి గురించి ఆలోచించాలి. ఇక కీర్తి సురేష్ కూడా ఒక ఆఫ్సను.

మరి కొరటాల ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి. ఈసారి అన్ని ఆలోచించుకునే నిర్ణయం తీసుకుంటారు. ‘ఆచార్య’ విషయంలో చేసిన తప్పులు చేయకుండా డెసిషన్ మేకింగ్ లో పక్కాగా ఉండాలనుకుంటున్నారట.

అలియా భట్ మళ్లీ తెలుగు ప్రేక్షకులకు ‘బ్రహ్మాస్త్ర’తోనే దర్శనమిస్తుంది. ఈ సినిమాని తెలుగులో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చెయ్యనున్నారు. రాజమౌళి ఈ సినిమాకి ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు.

More

Related Stories