‘బాహుబలి’ చిత్రాలతో ప్రభాస్ పేరు దేశమంతా మార్మోగింది. ఒక్కసారిగా ఆలిండియా స్టార్ అయ్యారు ప్రభాస్. ఐతే, బాహుబలి తర్వాత ఎలాంటి చిత్రాలు చెయ్యాలనే విషయంలో ప్రభాస్ నుంచి పూర్తిగా తప్పటడుగులు పడ్డాయి.
కేవలం ఒక్క సినిమా తీసిన దర్శకులకు వరుసగా రెండు సినిమాలు అప్పగించడం ప్రభాస్ చేసిన పెద్ద తప్పు. ‘రన్ రాజా రన్’ అనే చిన్న చిత్రం తీసిన సుజీత్ కి బాహుబలి తర్వాతి సినిమా బాధ్యతని అప్పగించాడు. పోనీ అతనేమైనా గొప్ప కథ తెచ్చాడా అంటే అదీ లేదు. ‘లార్గో వించ్’ అనే సినిమా కథని కాపీ కొట్టి లావిష్ గా తీశాడంతే. ఆ సినిమా హిందీలో తప్ప ఎక్కడా ఆడలేదు. ‘లార్గోవించి’ కథని త్రివిక్రమ్ కూడా కాపీకొట్టి (అజ్ఞాతవాసి) పరువుతీసుకున్నాడు అన్నది వేరే సంగతి. సుజీత్ కి ఇప్పటివరకు ఇంకో సినిమా ఆఫర్ రాలేదంటే అర్థం చేసుకోవచ్చు… అతని కథల ప్రతిభ ఎలాంటిదో.
ఇక రెండో సినిమాగా రాధాకృష్ణ కుమార్ కి అప్పగించాడు. గోపీచంద్ తో రాధాకృష్ణ కుమార్ తీసిన ‘జిల్’ సినిమా సో సోగా ఆడింది. ఆ సినిమాలో ఆయనేమి గొప్ప ప్రతిభ చూపలేదు. అయినా, ప్రభాస్ అతనికి అవకాశం ఇచ్చాడు. మళ్ళీ సేమ్ మాట. పోనీ ఇతనేమైనా గొప్ప కథ తెచ్చాడా అంటే అదీ లేదు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి 15 ఏళ్ల క్రితం రాసుకున్న కథని రాధాకృష్ణ కుమార్ తీసుకొని స్క్రిప్ట్ చేసుకున్నాడు. పక్కోళ్ల పాత చింతకాయ పచ్చడి మనకు సర్వ్ చేస్తున్నప్పుడే రిజెక్ట్ చెయ్యాలి. కానీ ప్రభాస్ ఆ పని చెయ్యలేదు. దాంతో, ఆ దర్శకుడు తీసిన ‘రాధేశ్యామ్’ తెలుగేతర అన్ని భాషల్లో దారుణ పరాజయం పాలైంది.
ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ కోసమంటూ స్పీడ్ గా ఒక సినిమా చేసి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు ప్రభాస్. మారుతి డైరెక్షన్ లో ఒక మసాలా సినిమా చెయ్యనున్నారు. మారుతి కథల్లో, కథనాల్లో కొత్తదనం ఏమి ఉండదు ‘ఎంటర్టైన్మెంట్’ తప్ప. అందుకే, క్లోజ్ ఫ్రెండ్ అయిన అల్లు అర్జున్ ఇంతవరకు ఛాన్స్ ఇవ్వలేదు. కానీ, ప్రభాస్ ఇప్పుడు మారుతితో మరో ప్రయోగం చేస్తున్నాడు. మరి మారుతి అయినా వొళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభాస్ అభిమానులను మెప్పించేలా చేస్తాడా అన్నది చూడాలి.
మారుతి, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా వచ్చే నెలలో కానీ, మేలో కానీ మొదలవుతుంది. ముగ్గురు హీరోయిన్లు ఉంటారు.
A decade after "Baahubali: The Beginning" transformed Indian cinema, Prabhas has reflected on the extraordinary…
Sai Durgha Tej’s ambitious film SYG (Sambarala Yeti Gattu) has entered its final shooting schedule…
The producers of “Nagabandham – The Secret Treasure” aka “Nagabandham” have revealed that their confidence…
Ravi Teja’s upcoming film “Irumudi” has completed its entire shoot and is now gearing up…
For years, inflated box-office collection posters have been a talking point in the Telugu film…
Following the disappointing performance of "Akhanda 2", director Boyapati Srinu is trying to set a…