రాజమౌళి బ్రాండ్ నేమ్ కలిసొచ్చేనా!

- Advertisement -
Rajamouli


‘బ్రహ్మాస్త్ర’ సినిమాకి ప్రెజెంటర్ గా ఉన్నారు రాజమౌళి. ఆయన తనవంతుగా ప్రచారం చేస్తున్న వైనం చూస్తున్నాం. ముఖ్యంగా తెలుగునాట ఆయన తాను డైరెక్ట్ చేసే సినిమా లెవల్లోనే ప్రచార బాధ్యతలు నెత్తిన ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది.

హిందీ వర్షన్ కి దేశమంతా అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ బాగుంది అని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. మరి, తెలుగులో కూడా ఈ శుక్రవారం ఈ సినిమాకి పెద్ద ఎత్తున ఓపెనింగ్ వస్తుందా అనేది చూడాలి. రాజమౌళి బ్రాండ్ నేమ్ ఈ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుతుందో.

రాజమౌళికి ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ దర్శకుడిగా గుర్తింపు, క్రేజ్ ఉంది. హిందీ సినిమాలు కూడా ఆయనతో పబ్లిసిటీ చేయించుకుంటున్నాయి. ఐతే, తెలుగు జనం మాత్రం రీసెంట్ గా పేర్లను, బ్రాండ్ నేమ్ లకు అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. మౌత్ టాక్, రివ్యూస్ పాజిటివ్ గా ఉంటేనే టికెట్ విండో వైపు కదులుతున్నారు. సో, రాజమౌళి ప్రచారం కొంత పనికి వస్తుంది. కానీ, ఈ సినిమాకి తెలుగునాట భారీ ఓపెనింగ్స్ వస్తాయా అనేది ఇప్పుడే చెప్పలేం.

‘బ్రహ్మాస్త్ర’లో రణబీర్ కపూర్, అలియా జంటగా నటించారు.

 

More

Related Stories