నటీనటులు జంతువుల్ని దత్తత తీసుకోవడం కొత్తేం కాదు. ఉపాసన ఏకంగా పులుల్ని దత్తత తీసుకొని వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంది. ఇప్పుడు రెజీనా (Regina Cassandra) వంతు.
ఈ హీరోయిన్ ఓ గుర్రాన్ని దత్త తీసుకుంది. ఆ విషయాన్ని ఆమె ప్రకటించడంతో పాటు, తన దత్త గుర్రానికి ఓ పేరు కూడా పెట్టింది.
“ఇదిగో, ఇదే నా మొదటి గుర్రం, నాకు ఎంతో ప్రత్యేకమైన మిల్టన్ కీన్స్‌ను పరిచయం చేస్తున్నాను. నేను ఊహించని ఒక ప్రపంచాన్ని నాకు పరిచయం చేసినందుకు రేస్ 2 విన్ ఫౌండేషన్ కు ధన్యవాదాలు.”
నిజానికి జంతు సంరక్షణ తనకు చిన్నప్పట్నుంచి అలవాటని చెబుతోంది రెజీనా. చిన్నప్పుడు పిల్లులు, ఉడతలు, కొన్ని పక్షుల్ని సంరక్షించేదాన్నని గుర్తు చేసుకుంది. జంతువుల్ని కూడా ప్రేమతో చూడడం తనకు అమ్మ నుంచి అలవాటైందంటోంది రెజీనా.
35 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ఇటీవల ‘మరీచక’ అనే తెలుగు సినిమాలో నటించింది. గత వారమే విడుదలైన ఈ సినిమా దారుణ పరాజయం పాలు అయింది. ప్రస్తుతం ఒక హిందీ సినిమా, 2 తమిళ సినిమాల్లో నటిస్తోంది.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…