హీరోయిన్ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) ఈరోజు 2 గుడ్ న్యూస్ లు బయటపెట్టింది. అందులో ఒకటి ఆమె సౌత్ కొరియా పర్యాటక రంగానికి గౌరవ అంబాసిడర్ గా ఎంపికైంది. ఈ మేరకు తన ఆనందాన్ని పంచుకుంటూ పోస్టు పెట్టింది.
“కొరియా పర్యాటకానికి గౌరవ రాయబారిగా నియమితులవడం నాకు నిజంగా చాలా ప్రత్యేకమైన విషయం. కొరియా సంస్కృతిని భారతీయ ప్రేక్షకులకు మరింత చేరువ చేయగల వ్యక్తిగా నన్ను గుర్తించినందుకు కొరియా ప్రభుత్వానికి, కొరియా పర్యాటక సంస్థకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కొరియా సంస్కృతి, సంప్రదాయాలు, ఆప్యాయత నన్ను ఎల్లప్పుడూ ప్రేరేపిస్తాయి. ఈ అందమైన ప్రయాణంలో భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది.”
అటు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు హాజరైన విందుకు ప్రియాంక మోహన్‌కు ఆహ్వానం లభించింది. దీనంతటికీ కారణం ఆమె చేసిన ‘మేడ్ ఇన్ కొరియా’ అనే చిత్రం.
మరోవైపు తన డ్రీమ్ ప్రాజెక్టును కూడా ప్రకటించింది ప్రియాంక మోహన్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో, ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ‘మంజనతి’ అనే సినిమా ప్రకటించింది. వీళ్లిద్దరితో కలిసి పనిచేయాలనే తన కల నెరవేరిందని చెప్పుకొచ్చింది.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…