అలియా భట్ బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్లలో ఒకరు. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కూతురిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ చాలా తొందరగా మంచి నటిగా, పెద్ద స్టార్ గా ఎదిగింది. ఇప్పుడు మరో పెద్ద స్టార్ రణబీర్ కపూర్ కి భార్య.
సొంతంగా కోట్ల రూపాయల ఆస్తి, భర్త ద్వారా మరింత ఎక్కువ ఆస్తి, సంపాదన కూడా ఎక్కువే. అయినా ఇప్పటికీ ఆమె ఇంకా కష్టపడాలని ప్రయత్నిస్తూ ఉంటుందట. ఈ విషయం ఆమె భర్త రణబీర్ కపూర్ చెప్పారు.
“నేను సాధారణంగా చేసింది చాలు, వచ్చింది చేసుకుంటూ వెళ్దాం అనుకుంటాను. తాను మాత్రం ఇంకా ఇంకా సాధించాలి అని తపన పడుతుంటుంది. గొప్ప గొప్ప సినిమాలు చెయ్యాలి చూస్తూ ఉంటుంది. ఛాలెంజ్ గా ఉండే పాత్రల కోసం పరితపిస్తుంది. ఆమెలో ఉన్న ఆ ఫైర్ చూసి ఆశ్చర్యపోతుంటాను,” అని రణబీర్ కపూర్ చెప్పారు.
ఆమె తండ్రి మహేష్ భట్ కూడా ఇదే మాట అంటున్నారు. “అలియాకి సినిమా హీరోయిన్ గా అవకాశాలు సులువుగా వచ్చాయి అనే మాట నిజమే. కానీ హీరోయిన్ గా సక్సెస్ కావడం, ఇంత సాధించడం అంతా ఆమె కష్టమే. నా కూతురు సెల్ఫ్ మేడ్ స్టార్. తనని తాను తీర్చిదిద్దుకొని విజయాలు సాధించింది,” అని మహేష్ భట్ అన్నారు.
అలియా భట్ కి ఒక కూతురు. తల్లిగా మారిన తర్వాత కూడా ఆమె హీరోయిన్ గా వెనక్కి తగ్గలేదు. భర్తతో కలిసి “లవ్ అండ్ వార్” అనే సినిమా చేస్తోంది. అలాగే మరో రెండు పెద్ద సినిమాలు ఒప్పుకొంది. తెలుగులో ఇప్పటికే “ఆర్ ఆర్ ఆర్”లో నటించిన ఈ భామ మరో తెలుగు సినిమా చేసేందుకు సిద్ధంగా ఉంది.
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…