పవన్ కల్యాణ్ గురించి తెలిసిన వాళ్లు, ఆయనకు సంబంధించి కొత్త కొత్త విషయాలు చెబుతుంటారు. ప్రతి ఒక్కరికి కొత్తగా కనిపించడం పవన్ కల్యాణ్ ప్రత్యేకత. హీరోయిన్ అనన్య నాగళ్లకు కూడా పవన్ కల్యాణ్ అలానే కొత్తగా కనిపించారు.
పవన్ తో కలిసి “వకీల్ సాబ్” సినిమాలో నటించింది అనన్య నాగళ్ల. ఆయనతో నటించడమే తనకు దక్కిన పెద్ద అదృష్టమని అంటోంది. ఈ సందర్భంగా పవన్ లో తను గమనించిన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది.
“నేను పవన్ కల్యాణ్ లో బయట చూడనిది, సెట్స్ లో చూసింది ఏంటంటే.. అప్పుడప్పుడు పవన్ కల్యాణ్ పిల్లలు సెట్స్ కు వచ్చేవాళ్లు. ఆద్య వచ్చినప్పుడు చాలా ప్రేమగా ఉండేవారు. చాలా కేరింగ్ గా చూసుకునే వారు. అది చూసినప్పుడు నాకు మంచి ఫీలింగ్ కలిగింది. మన ఇంట్లో తల్లిదండ్రుల్లానే హీరోలు కూడా తమ పిల్లల్ని నార్మల్ గా, సింపుల్ గా, కేరింగ్ గా చూసుకుంటున్నారనిపించింది. ఆద్యను దగ్గరకు తీసుకున్నప్పుడు పవన్ లో నాకు వన్ పర్సెంట్ కూడా హీరోయిజం కనిపించలేదు.”
లొకేషన్ లో పవన్ కల్యాణ్ పెద్దగా మాట్లాడరట. తన షాట్ పూర్తయిన వెంటనే పక్కకెళ్లి పుస్తకం చదువుకుంటారట. ఎవరైనా చొరవ తీసుకొని వస్తే మాత్రం పుస్తకం పక్కనపెట్టి ఎంతసేపైనా మాట్లాడతారట. అవసరమైతే తనకు చేతనైనంత సహాయం చేస్తారట.
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…