దర్శకుడు అనిల్ రావిపూడికి సంక్రాంతి సెంటిమెంట్ పట్టుకొంది. వెంకటేష్ హీరోగా ఆయన తీసిన “సంక్రాంతికి వస్తున్నాం” పెద్ద హిట్ కావడంతో రావిపూడి ఇదొక కేస్ స్టడీ అని, ఎప్పుడూ చూడని వాళ్ళు కూడా సినిమాలు చూశారంటూ ఏవేవో మాటలు మాట్లాడేస్తున్నాడు. అదేదో బాహుబలి 2 సినిమాలా చెప్పేస్తున్నాడు.
300 కోట్ల వసూళ్లు అనే అబద్దపు స్టేట్మెంట్ పక్కన పడితే మొత్తానికి పెద్ద హిట్ ఐతే అందుకున్నాడు రావిపూడి. దాంతో ఇప్పుడు ప్రతి సంక్రాంతికి సినిమా తేవాలనే పట్టుదల కనబరుస్తున్నాడు.
2026 సంక్రాంతికి, 2027 సంక్రాంతికి కర్చీఫ్ వేశాడు అనిల్ రావిపూడి.
అనిల్ రావిపూడి – మెగాస్టార్ చిరంజీవి కలయికలో త్వరలోనే ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది. దీన్ని కూడా సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాత ప్రకటించారు. ఇక తాజాగా వెంకటేష్ కూడా మరో ప్రకటన చేశారు. 2027 సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం అంటూ చెప్పేశారు. అంటే అనిల్ రావిపూడి – వెంకటేష్ కాంబినేషన్లో మరో సినిమా 2027 సంక్రాంతికి విడుదల అవుతుంది. అలా వచ్చే రెండు సంక్రాంతులను ముందే బుక్ చేసేశారు.
—
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…