విజయ్ దేవరకొండ సినిమా కోసం ముగ్గురు ప్రముఖ స్టార్స్ ముందుకొచ్చారు. విజయ్ దేవరకొండ 12వ చిత్రం మొదటి టీజర్ రేపు విడుదల కానుంది. ఈ టీజర్ కి వాయిస్ ఓవర్ చెప్పారు ముగ్గురు బడా స్టార్స్.
తెలుగు టీజర్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన గొంతు అందించారు. హిందీ కోసం రణబీర్ కపూర్, తమిళ్ కోసం సూర్య వాయిస్ ఇవ్వడం విశేషం. నిర్మాత నాగవంశీతో అనుబంధం కారణంగా ఎన్టీఆర్ అంగీకరించగా, విజయ్ దేవరకొండతో ఉన్న స్నేహం వల్ల రణబీర్ కపూర్, సూర్య ఒప్పుకున్నారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండకి భారీ హిట్ అవసరం. ఈ ముగ్గురు స్టార్స్ సహకారం, వారి గొంతు ఈ సినిమాకి మంచి బజ్ వచ్చేలా చేస్తుంది.
ఈ సినిమా టీజర్ లో ఈ హీరోలు విజయ్ దేవరకొండ పాత్రకి సంబంధించిన ఎలివేషన్లు ఇస్తారట. చివరలో విజయ్ దేవరకొండ పాత్ర ఎంట్రీ ఇస్తుందట.
ఈ వేసవిలో ఈ సినిమాని విడుదల చేసే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఈ డైరెక్టర్ ఇంతకముందు నానితో ‘జెర్సీ’ సినిమా తీశారు.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…