అవీ ఇవీ

AP: తీసిన లొకేషన్ చెప్పాలంట

సినిమా షూటింగ్‌ల ద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని ఏపీ (AP) ప్రభుత్వం యోచిస్తోంది. “పుష్ప” సినిమాను ఉదాహరణగా పేర్కొంటూ, ఆ సినిమా తర్వాత మారేడుమిల్లికి పాపులారిటీ లభించిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేందుకు సినిమా సబ్ టైటిల్స్‌లో షూటింగ్ ప్రదేశాల పేర్లను ప్రదర్శించాలని కూడా ఆయన సూచించారు.

మారేడుమిల్లిలో ఎప్పటి నుంచో షూటింగ్ లు జరుగుతున్నా “పుష్ప” వల్లే పాపులార్టీ పెరిగింది అంటున్నారు.

సగం తెలుగు సినిమాలు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. అంటే ఇక అన్ని సినిమాల్లో ఇది విశాఖలో తీశాం, ఇది రాజమండ్రిలో తీశాం, ఇది కాకినాడలో చిత్రీకరించాం అని స్క్రీన్ పై కనిపించాలి అన్నమాట.

దీనికి తెలుగు దర్శక, నిర్మాతలు ఒప్పుకుంటారా?

మరి తెలంగాణాలో తీసిన ప్రదేశాలకు, విదేశాల్లో తీసిన ప్రాంతాలకు కూడా సబ్ టైటిల్ లో వెయ్యాలా?

TeluguCinema

Recent Posts

Sai Tej: ఇంకెక్కడ నాకు పెళ్లి అవుతుంది?

సాయిదుర్గతేజ్ పెళ్లి మేటర్ ఇప్పటిది కాదు. సమయం, సందర్భం లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు సాయితేజ్ పెళ్లి టాపిక్ తెరపైకి వస్తూనే…

3 hours ago

Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం

బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి సౌందరరాజన్ (Varshini Sounderajan) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  పేరుకు…

3 hours ago

సుకుమార్ బ్లెస్సింగ్స్ తీసుకున్న Priyadarshi

ప్రియదర్శి (Priyadarshi) హీరోగా కొత్త సినిమాలు ఒప్పుకుంటేనే ఉన్నాడు. ఇప్పటికే లీడ్ పాత్రలో కోర్టు, మల్లేశం, బలగం వంటి సినిమాలతో…

7 hours ago

Toxic: అవును తండ్రీకొడుకుల కథనే!

ఈ రోజు (జూన్ 21) ఫాదర్స్ డే. సరిగ్గా ఈ రోజే యష్ హీరోగా నటిస్తున్న "టాక్సిక్" (Toxic) సినిమాకి…

9 hours ago

Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ

'మల్లేశం', 'వకీల్ సాబ్' సినిమాలు చేసినప్పుడు అనన్య (Ananya Nagalla)లో ఈ కోణాన్ని ఎవ్వరూ చూడలేదు. ఇన్నాళ్లూ ఇంత అందాన్ని…

1 day ago

Ritika Nayak: హిట్ హీరోయిన్ ను వదిలేశారేంటి?

టాలీవుడ్ యంగ్ బ్యూటీ రితికా నాయక్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటీవలే 'మిరాయి' సినిమాతో…

1 day ago