నటి మీరా వాసుదేవన్ (Meera Vasudevan) తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. “గోల్మాల్”, “అంజలి ఐ లవ్ యూ” వంటి తెలుగు చిత్రాల్లో నటించిన ఆమె, తర్వాత మలయాళ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా మలయాళంలో “తన్మాత్ర” చిత్రంతో ప్రశంసలు అందుకుంది.
ఆమె మూడు సార్లు పెళ్లి చేసుకొంది. మూడు విఫలం అయ్యాయి. ప్రస్తుతం కొడుకుతో సింగిల్ గా జీవితాన్ని గడుపుతోంది.
మూడు పెళ్లిళ్ల కారణంగా జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని కోల్పోయానని మీరా వాసుదేవన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
“నా కొడుకుతో నేను ఎప్పుడూ చెబుతుంటాను… మూడు అర్థంలేని పెళ్లిళ్ల కోసం నా జీవితంలోని 17 సంవత్సరాలు వృథా చేసుకున్నాను. ఆ సమయంలో నేను తెలివిగా కెరీర్‌పై దృష్టి పెట్టి ఉంటే ఇంకా చాలా సాధించేదాన్ని,” అని పేర్కొంది.
సినిమా, ఫిట్‌నెస్, మంచి స్నేహితులని పెంచుకోవడం వంటి తనకు ఇష్టమైన విషయాలపై దృష్టి పెట్టాల్సిందిపోయి, తనను గౌరవించని వ్యక్తుల కోసం సమయం వృథా చేసుకున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…