
సినిమా షూటింగ్‌ల ద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని ఏపీ (AP) ప్రభుత్వం యోచిస్తోంది. “పుష్ప” సినిమాను ఉదాహరణగా పేర్కొంటూ, ఆ సినిమా తర్వాత మారేడుమిల్లికి పాపులారిటీ లభించిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేందుకు సినిమా సబ్ టైటిల్స్‌లో షూటింగ్ ప్రదేశాల పేర్లను ప్రదర్శించాలని కూడా ఆయన సూచించారు.
మారేడుమిల్లిలో ఎప్పటి నుంచో షూటింగ్ లు జరుగుతున్నా “పుష్ప” వల్లే పాపులార్టీ పెరిగింది అంటున్నారు.
సగం తెలుగు సినిమాలు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. అంటే ఇక అన్ని సినిమాల్లో ఇది విశాఖలో తీశాం, ఇది రాజమండ్రిలో తీశాం, ఇది కాకినాడలో చిత్రీకరించాం అని స్క్రీన్ పై కనిపించాలి అన్నమాట.
దీనికి తెలుగు దర్శక, నిర్మాతలు ఒప్పుకుంటారా?
మరి తెలంగాణాలో తీసిన ప్రదేశాలకు, విదేశాల్లో తీసిన ప్రాంతాలకు కూడా సబ్ టైటిల్ లో వెయ్యాలా?
