Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Kurchi Madathapetti: త్వరలోనే వంద కోట్ల మైలురాయి!

TeluguCinema, June 30, 2026June 30, 2026
Kurchi Madathapetti song

మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చర్చ అనవసరం. ఆ సినిమా కాలగర్భంలో కలిసిపోయినా, అందులోని ఓ పాట మాత్రం ఇంకా సోషల్ మీడియాను హోరెత్తిస్తూనే ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేసిన ఊరమాస్ సాంగ్, ‘కుర్చీ మడతపెట్టి’ (Kurchi Madathapetti). థియేటర్లలోనే కాదు, సోషల్ మీడియాలోనూ ఊచకోత కోస్తోంది.

నిజానికి ఈ పాట రిలీజైన కొత్తలో కొన్ని వివాదాలు, విమర్శలు చుట్టుముట్టినప్పటికీ.. వాటన్నింటినీ తన మాస్ బీట్‌తో తొక్కిపారేసింది ఈ సాంగ్. ఆ కాంట్రవర్సీలన్నింటినీ దాటుకుని గ్లోబల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పాట, తాజాగా యూట్యూబ్‌లో మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

టాలీవుడ్ హిస్టరీలోనే మరే పాటకూ సాధ్యం కాని రీతిలో, అత్యంత వేగంగా ఏకంగా 800 మిలియన్ల వ్యూస్ మార్కును దాటేసి ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ సరికొత్త రికార్డును స్థాపించింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ పాట దూసుకుపోతున్న స్పీడ్ చూస్తుంటే, చాలా త్వరలోనే వంద కోట్లు  (1 బిలియన్) వ్యూస్ మైలురాయిని కూడా అందుకునేలా ఉంది.

ఈ పాట ఈ రేంజ్ సక్సెస్ సాధించడానికి మెయిన్ రీజన్ స్క్రీన్ మీద మహేష్ బాబు, శ్రీలీల వేసిన ఊరమాస్ స్టెప్పులే. వీరిద్దరి అదిరిపోయే ఎనర్జీకి, థమన్ ఇచ్చిన హై-వోల్టేజ్ బీట్స్ తోడవడంతో పెద్ద హిట్టయింది.

సినిమా రిలీజై ఇన్నాళ్లవుతున్నా, రీల్స్ లోనూ, షార్ట్స్‌లోనూ ఇప్పటికీ ‘కుర్చీ మడతపెట్టి’ ట్రెండ్ అవుతూనే ఉంది. పెళ్లిళ్లు, పార్టీలు, ఈవెంట్స్ ఎక్కడ చూసినా ఈ పాట మోత మోగాల్సిందే. గ్లోబల్ ఆడియన్స్‌ని సైతం మెప్పించడంతో, ఈ పాటకు ఇన్ని వ్యూస్ సాధ్యమైంది. 

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు

Recent News

  • Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • నాగవంశీకే డేట్ పాటించాలని చెప్పిన Akkineni Nagarjuna
  • పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Jana Nayagan: విజయ్ కోసం కఠినమైన రూల్స్
  • నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes