బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించిన ‘భైరవం’ సినిమా రేపు (మే 30) విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రమోషనల్ వీడియో వచ్చింది. మంచు మనోజ్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నారా రోహిత్ కూర్చొని క్యారమ్స్ అడుతుంటే, అక్కడికి సాయిదుర్గతేజ్ వస్తాడు ఆ వీడియోలో. నలుగురూ కలిసి సరదాగా మాట్లాడుకున్నారు.
ఈ చిట్ చాట్ లో బెల్లంకొండ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సాయిదుర్గతేజ్.
మంచు మనోజ్ కు పెళ్లయిపోయిందని, నారా రోహిత్ కు త్వరలోనే పెళ్లవుతుందని, తనకు ఈ జీవితంలో పెళ్లి కాదని అన్నాడు. అదే టైమ్ లో సాయిశ్రీనివాస్ గురించి మాట్లాడుతూ.. ఓ పెద్ద కుటుంబానికి చెందిన యువరాణి సాయిశ్రీనివాస్ కోసం సిద్ధంగా ఉందంటూ లీకులిచ్చాడు.
సాయిదుర్గతేజ్ యువరాణి అనగానే, మంచు మనోజ్ కూడా అవును…అవును అంటూ తలూపాడు.
షూటింగ్ గ్యాప్స్ లో 2-3 గంటలు ఒక్కోసారి సాయిశ్రీనివాస్ కనిపించడని, యువరాణిని కలవడానికి వెళ్లిపోతుంటాడని అన్నాడు. బెల్లంకొండ పెళ్లాడబోయే ఆ యువరాణి ఎవరనే చర్చ మొదలైంది.
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…