ఉన్నట్టుండి సడెన్ గా అల్లు అర్జున్ పై సంపతీ జనరేట్ అయింది. ఓవైపు ‘పుష్ప-2’ సినిమా ట్రయిలర్ పై సగం పాజిటివ్ గా, సగం నెగెటివ్ గా చర్చలు సాగుతున్న వేళ.. ఒకే ఒక్క ఫొటో మొత్తం చర్చను బన్నీ వైపు తిప్పింది.
లిరిక్ రైటర్ చంద్రబోస్ ఓ ఫొటో షేర్ చేశారు. అందులో అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ నవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. బన్నీ-దేవిశ్రీ… అదే విధంగా సుక్కూ-దేవిశ్రీ మధ్య ఆల్ ఈజ్ వెల్ అనే విధంగా ఈ ఫొటో ఉంది.
ఈ సంగతి పక్కనపెడితే.. ఫొటోలో బన్నీ కళ్లు ఉబ్బిపోయి ఉన్నాయి. అతడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడనే విషయం ఈ ఒక్క ఫొటో చూస్తే అర్థమైపోతుంది. దీంతో అతడిపై సోషల్ మీడియాలో సానుభూతి వెల్లువెత్తుతోంది. కాసేపు పడుకో బన్నీ అంటూ తెగ పోస్టులు పడుతున్నాయి.
నిజానికి అక్కడ బన్నీనే కాదు.. సుక్కూ, దేవిశ్రీ పరిస్థితి కూడా అలానే ఉంది. రాత్రిపగలు తేడా లేకుండా ‘పుష్ప-2’ కోసం పనిచేస్తున్నారు వీళ్లంతా. మూడేళ్లుగా సినిమా తీస్తూ, ఇలా ఆఖరి నిమిషంలో కూడా కష్టపడుతున్నారు. వచ్చే వారానికి సెన్సార్ కాపీ రెడీ చేయాలి. అది వీళ్ల ముందున్న మొదటి టార్గెట్.
శ్రీముఖి (Sreemukhi) యాంకర్ గా చాలా ఫేమస్. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది. షోలు చేస్తోంది. తాజాగా సమంత హీరోయిన్…
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) అంటే అందరికీ ట్రోలింగ్ మెటీరియల్ అని చెప్పాలి. అయ్యగారు అంటూ ట్రోల్ చేస్తూ ఉంటారు…
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఇంకా ఇంకా బాగా సంపాదించాలి అనే కసితో ఉంది. అందుకే వచ్చిన ఏ అవకాశాన్నీ…
39 ఏళ్లకే చాలా జీవితాన్ని చూశానంటోంది సమంత (Samantha). తను అనుభవించిన కష్టాలు, నష్టాలన్నీ ప్రజలకు తెరిచిన పుస్తకం లాంటివని,…
ఇటీవల ధురంధర్ 2 (Dhurandhar 2) హిందీ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఆ సినిమా అమెరికా (North…
"2023లో నేను సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. కానీ జీవితం అనుకోని మలుపులు తిప్పింది. అలా సింగీతం శ్రీనివాసరావు…