ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) ప్రపంచ సుందరి. ఆమె ఆ కిరీటాన్ని కూడా పొందింది. హీరోయిన్ గా అగ్రస్థానంలో చాలా ఏళ్ళు ఉంది. ఇప్పుడు 50 దాటాక, సహజంగానే ఆమె అందం మసకబారింది. ఐతే, సహజమైన అందంలో ఆమెని మించి ఎవరూ లేరు అంటోంది దర్శకురాలు ఫరా ఖాన్.
ఫరా ఖాన్ ఇప్పుడు యూట్యూబర్ గా మారారు. తన కుక్ దిలీప్ తో కలిసి ఆమె వంటల వీడియోలు చేస్తూ లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. ఈ వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. తాజాగా ఒక వీడియోలో ఆమె తన గ్లోయింగ్ స్కిన్ గురించి మాట్లాడుతూ ఇది అంతా నేచురల్ అందం అని చెప్పింది.
“బహుశా ఈ ఇండస్ట్రీలో ఐశ్వర్య రాయ్ ని మినహాయిస్తే నాదే సహజమైన మెరుపు,” అని ఆమె చమత్కరించారు.
ఐశ్వర్య రాయ్ అందం గురించి పొగడడం బాగానే ఉన్నా, ఆమె తప్ప భారతీయ సినిమా రంగంలో ఏ హీరోయిన్ ది కూడా సహజమైన అందం కాదు అని ఆమె కామెంట్ చేసినట్లు అయింది. చాలామంది హీరోయిన్లు మేకప్పులోనే అందంగా కనిపిస్తారు అనేది నిజం. అలాగే దాదాపుగా ఇప్పుడు హీరోయిన్లు అందరూ తమ మేని సౌందర్యం కోసం, ఛాయ కోసం సర్జరీలు చేయించుకున్నవారే. మందులు వాడుతున్నవాళ్ళే. అందుకే ఫరా అలా కామెంట్ చేసింది కాబోలు.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…