తెలుగు సినిమా చిత్రమైన ట్రెండ్ ఫాలో అవుతుంటుంది. ఆ మధ్య ఎన్నో స్పై చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఆ ట్రెండ్ ముగిసింది. ఇప్పుడు ప్రధానంగా భక్తి చిత్రాలు, రామాయణ, మహాభారతాలకు లింక్ చేస్తూ పాన్ ఇండియా చిత్రాలు తీసే ట్రెండ్ నడుస్తోంది. ఆ ట్రెండ్ తో పాటు కొత్తగా బ్రిటిష్ కాలం కథల జోరు కూడా ఊపందుకుంటోంది.
ఇదే నేపథ్యంతో ఈ ఏడాది మూడు తెలుగు చిత్రాలు విడుదల కానున్నాయి. అవేంటో చూద్దాం.
రణబాలి (Ranabaali)
విజయ్ దేవరకొండ హీరోగా “రణబాలి” అనే చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్, వీడియో గ్లిమ్ప్స్ విడుదల చేశారు. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం వచ్చింది. కానీ మనకు బ్రిటిష్ వారి నుంచి విముక్తి కల్పించేందుకు ఎందరో పోరాట యోధులు సమరం చేశారు. దేశం నలుమూలల అనేకమంది యోధులు తమ దగ్గర ఉన్న క్రూరమైన బ్రిటిష్ జనరల్స్, అధికారులపై పోరాటం చేశారు. చరిత్రలో కొద్దిమందికే చోటు దక్కింది. అలా మరుగున పడిన ఒక యోధుడి కథ ఇది.
విజయ్ దేవరకొండ రణబాలి అనే యోధుడిగా నటిస్తున్నారు. కథ రాయలసీమ ప్రాంతంలో 1947కి అనేక సంవత్సరాల ముందు జరుగుతుంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బ్రిటిష్ వారి దురాగతాలు, ఒక యోధుడి సాహసాలు చూపిస్తుంది.
ఫౌజీ (Fauji)
ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న ఒక భారీ చిత్రం…ఫౌజీ. దర్శకుడు హను రాఘవపూడి తీస్తున్న ఈ చిత్రం షూటింగ్ సగభాగం పూర్తి అయింది. ఈ సినిమా కథ 1940 కాలంలో సాగుతుంది. ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ సృష్టించిన సైన్యంలో ఒక సైనికుడిగా ఉండి, ఆ స్పూర్తితో ఇక్కడ రజాకార్లపై తిరుగుబాటు చేసిన హీరోగా ప్రభాస్ కనిపిస్తాడు.
ది ఇండియా హౌజ్ (The India House)
నిఖిల్ సిద్ధార్థ హీరోగా రూపొందుతోన్న “ది ఇండియా హౌజ్” కూడా బ్రిటిష్ కాలం నాటి కథే. బ్రిటిష్ వాళ్ళ వైపే పోరాడుతూ వాళ్ళకే డిచ్ కొట్టిన ఒక ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ కథ ఇది. నిఖిల్ సిద్ధార్థ్ ఇందులో బ్రిటిష్ గూఢచారిగా కనిపిస్తాడు.
ఈ మూడు చిత్రాలు ఈ ఏడాదే విడుదల కానున్నాయి.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…