ఇంటర్వ్యూలు

Eesha Rebba: ‘శాంతి అందరికీ నచ్చుతుంది’

ఈషా రెబ్బ నటించిన “ఓం శాంతి శాంతి శాంతిః” జనవరి 30న గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఆమె తరుణ్ భాస్కర్ సరసన నటించింది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఎందుకు మీరు సినిమాల విషయంలో చాలా గ్యాప్ తీసుకున్నారు?

కొంచెం గ్యాప్ వచ్చిన మాట నిజమే. ఇంతకుముందు సినిమా సరిగ్గా వర్కౌట్ కాలేదు. దర్శకుడు కథ చెప్పిన దానికి, తీసిన తర్వాత ఉండే పాత్రకు తేడా లేకుండా ఉన్నప్పుడే సినిమా చేద్దామని అనుకుంటున్నాను. అందుకే, ఈ సినిమా నచ్చి ఒప్పుకున్నాను.

మరి ఇది రీమేక్ చిత్రం కదా?

అవును… మలయాళ చిత్రం చాలా ఇష్టం నాకు. అందులో హీరోయిన్ క్యారెక్టర్ బాగా నచ్చింది. నాకు సూట్ అవుతుంది అనిపించి వెంటనే ఒప్పుకున్నాడు. ఈ కథ, నా పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది, నచ్చుతుంది.

తెలుగు నేటివిటికి తగ్గట్టు కథలో పాత్రల్లో చాలా మార్పులు చేశారు. రీమేక్ అనే ఫీలింగ్ రాదు. నా పాత్ర పేరు శాంతి. కెరీర్ లో ఒక్కసారైనా ఇలాంటి పాత్ర వస్తే చేయాలని అనుకునేదాన్ని. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. ఈ సినిమాకి హండ్రెడ్ పెర్సెంట్ ఎఫర్ట్ పెట్టాను.

సినిమాలో హీరో తరుణ్ భాస్కర్ ని నిజంగానే కొట్టారా?

కథలో చెంప దెబ్బలు ఉన్నాయి. ఒక దెబ్బ చెంపకి తగిలేలా ఉండాలి. చట్నీ చెంపకి అంటుకునేలా ఒక సీన్ ఉంది. అది రావాలంటే ఖచ్చితంగా కొట్టాల్సిందే. ఆ రకంగా నిజంగానే గట్టిగా ఒక చెంప దెబ్బ తగిలింది( నవ్వుతూ). ఆ సీన్ లో నా కళ్ళల్లో వచ్చిన నీళ్లు రియల్.

గోదారి యాస పలకడం ఎలా అనిపించింది?

నాకు యాస విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మా అమ్మగారిది రాజమండ్రి. నేను సమ్మర్ హాలిడేస్ కి ప్రతిసారి అక్కడికి వెళ్ళేదాన్ని. అయితే తరుణ్ గారికి యాస ఒక ఛాలెంజ్. ఆయన చాలా యాస కోసం చాలా శ్రమించారు. ఎందుకంటే ఇప్పటివరకు అయినా తెలంగాణ తప్పితే మరో యాస పాత్రలు చేయలేదు. ఈ సినిమాకు మాత్రం చాలా కష్టపడ్డారు. అవుట్ ఫుట్ చాలా అద్భుతంగా వచ్చింది. తెరపై మీకు ఓంకార్ నాయుడు పాత్ర మాత్రమే కనిపిస్తుంది.

తరుణ్ భాస్కర్ తో నటించడం గురించి చెప్పండి?

తరుణ్ భాస్కర్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన స్వతహాగా దర్శకుడు అయినా ఏ రోజు కూడా ఆయన దర్శకుడికి సలహాలు ఇవ్వలేదు. మానిటర్ చూడటం నేను చూడలేదు.

TeluguCinema

Recent Posts

Raghava Lawrence: రాజకీయాలకు ఎస్, ఉప ఎన్నికకు నో

హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…

5 hours ago

Kurchi Madathapetti: త్వరలోనే వంద కోట్ల మైలురాయి!

మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…

9 hours ago

Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!

పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…

12 hours ago

Alcohol: మర్చిపోయిన మూవీని గుర్తు చేశారు

ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…

12 hours ago

నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…

1 day ago

Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!

సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…

1 day ago