రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాపై ఇప్పుడిప్పుడే హైప్ పెరుగుతోంది. ఆల్రెడీ సినిమా యూనిట్ ఇంటర్వ్యూలు మొదలుపెట్టింది. దర్శకుడు శంకర్, ఓ సెక్షన్ మీడియాకు ఇంటర్వ్యూలిచ్చారు. తాజాగా మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా కూడా ‘గేమ్ ఛేంజర్’ గురించి మాట్లాడారు. సినిమాలో డైలాగ్స్ అద్భుతంగా వచ్చాయంటున్నారు.
“శంకర్ దర్శకత్వంలో సినిమా వస్తుందనగానే సమాజం గురించి ఏదో ఒక డిస్కషన్ ఉంటుంది. సమాజంపై ఆయన ఏదో ఒకటి చెప్పాలని అందరం ఆశిస్తాం. అది ‘గేమ్ ఛేంజర్’లో ఉంటుంది. ఇప్పటివరకు శంకర్ నుంచి వచ్చిన సినిమాల్లో ఎలాంటి అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయో.. వాటికి ఏమాత్రం తగ్గకుండా ఇందులో కూడా డైలాగ్స్ ఉంటాయి.”
ఇలా ‘గేమ్ ఛేంజర్’లో డైలాగ్స్ పై స్పందించారు సాయిమాధవ్. మరీ ముఖ్యంగా సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తనకు బాగా నచ్చిందని, ఆ ఎపిసోడ్ కు తను కొన్ని మంచి డైలాగ్స్ రాశానని ఆయన వెల్లడించాడు. సో.. ‘గేమ్ ఛేంజర్’లో బలమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందనే విషయాన్ని సాయిమాధవ్ కన్ ఫర్మ్ చేశారు.
సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలోకి వస్తోంది ‘గేమ్ ఛేంజర్’. డాలస్ లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం చరణ్ అక్కడే ఉన్నాడు. సుకుమార్ చీఫ్ గెస్ట్.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…