రష్మిక మందాన (Rashmika Mandanna) తల్లి కాబోతోంది అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. దానికి కారణం ఉంది. ఆమె రెండు రోజుల క్రితం “త్రి ఆఫ్ అస్” (Three of Us) అంటూ ఒక పోస్టులో పేర్కొంది. మేము ముగ్గురం అనే అర్థంలో ఉన్న ఆ పోస్ట్ తో ఆమె తల్లిగా మారనుంది అని నెటిజెన్లు ఫిక్స్ అయ్యారు.
నిన్న ఆమె పుటిన రోజు. పెళ్లి తర్వాత పుట్టిన రోజు వేడుకలను ఒక దేవాలయంలో జరుపుకొంది. ఆమె భర్త విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. రష్మిక అత్తామామ, తల్లితండ్రులు, చెల్లెలు కూడా ఈ వేడుకల్లో కనిపించడంతో తల్లి కాబోతున్న వార్తలకు కొంత బలం వచ్చింది.
ఐతే, ఈ గర్భవతి వార్తలు నిజం కాదంట. ఇదంతా సోషల్ మీడియా పుకారు మాత్రమే.
విజయ్ దేవరకొండ, రష్మిక మందాన ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకున్నారు. మొదటి నెల పూర్తి అయింది. ఇటీవలే వారు “రణబలి” అనే సినిమా షూటింగ్ ని అనంతపురంలో పూర్తి చేశారు. షూటింగ్ చేస్తున్న టైంలోనే ఆమె గర్భవతి అనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఆమె టీం మాత్రం ఇదంతా అబద్దమని చెప్తోంది.
ఒకవేళ నిజంగానే ఆమె ప్రెగ్నెంట్ అయినా ఆమె స్వయంగా అంత తొందరగా సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యదు. పెళ్లి విషయాన్నీ కూడా ఆమె ముందే చెప్పలేదు. అలాంటిది “గర్భవతి” అనే విషయాన్ని పెళ్లైన నెలకే ఆమె ఎందుకు ప్రకటిస్తుంది?
సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…
సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…
ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…
"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…
గ్లామర్ డాల్‌గా, లవ్లీ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల మనసులు దోచుకున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Mohan) ఇప్పుడు తన కెరీర్‌లోనే…